వైభవంగా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పూజలు

చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంతో వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.  ఈ రోజు ( సెప్టెంబర్ 14)  జరిగిన పూజా కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.  గణపతి బొప్పా మోరియా.. జై గణేష్ మహరాజ్ కీ జై  అంటూ భజనలు చేశారు.  అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్నదానం నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పూజల అనంతనరం  భక్తులు  తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.