క్విక్ కామర్స్​కు ఫుల్ పాపులారిటీ

 

  • ఆన్‌‌‌‌లైన్ షాపర్లలో 91 శాతం మందికి దీనిపై అవగాహన 
  • జెప్టో, బ్లింకిట్‌‌‌‌, ఇన్‌‌‌‌స్టామార్ట్‌‌‌‌ వంటి యాప్‌‌‌‌లలో పెరుగుతున్న గ్రోసరీ అమ్మకాలు
  • క్లాత్స్‌‌‌‌, యాక్సెసరీల కోసం  ఈ–కామర్స్‌‌‌‌ వైపు మొగ్గు: మెటా సర్వే

న్యూఢిల్లీ: వస్తువులను అతిత్వరగా డెలివరీ చేసే క్విక్‌‌‌‌ కామర్స్ ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తోంది. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో  ఈ కంపెనీల పాపులారిటీ  రోజురోజుకీ  పెరుగుతోంది. మెటా చేసిన సర్వే ప్రకారం, 91 శాతం మంది ఆన్‌‌‌‌లైన్ కన్జూమర్లకు క్విక్ కామర్స్ యాప్‌‌‌‌ల గురించి తెలుసు. ఈజీగా ఆర్డర్లు పెట్టుకోవడానికి వీలుండడంతో పాటు, వేగంగా డెలివరీ జరుగుతుండడంతో వినియోగదారులు క్విక్ కామర్స్ యాప్‌‌‌‌లకు అలవాటు పడుతున్నారు. 

జెప్టో, బ్లింకిట్‌‌‌‌, ఇన్‌‌‌‌స్టామార్ట్‌‌‌‌ వంటి ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌  క్విక్ కామర్స్ ఇండస్ట్రీలో టాప్ ప్లేయర్లు. ఈ  స్టార్టప్‌‌‌‌లు భారీగా ఫండ్స్‌‌‌‌ సేకరించి, బిజినెస్‌‌‌‌ను విస్తరిస్తున్నాయి. ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌ ఇప్పటికే క్విక్‌‌‌‌కామర్స్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లోకి ఎంట్రీ ఇవ్వగా,  అమెజాన్  కూడా రెడీ అవుతోంది.  మెటా సర్వే ప్రకారం, 57 శాతం మంది యూజర్లు  క్విక్‌‌‌‌ కామర్స్ ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌లో ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. వీరు ముఖ్యంగా గ్రోసరీ, పర్సనల్ కేర్ ప్రొడక్ట్‌‌‌‌లను కొనుగోలు చేస్తున్నారు. బట్టలు, షూస్ వంటి ఫ్యాషన్ ప్రొడక్ట్‌‌‌‌లు ఈ–కామర్స్ ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌లో  ఎక్కువగా అమ్ముడవుతుండగా,  గ్రోసరీ సెగ్మెంట్ మాత్రం క్విక్‌‌‌‌ కామర్స్ కంపెనీలతో లాభపడుతోంది. 

డెలివరీ టైమ్‌‌‌‌, ఖర్చులు రెండూ తగ్గితే ఈ సెక్టార్ మరింత విస్తరిస్తుందని అంచనా. మెటా మొత్తం 2,501 మంది ఇంటర్నెట్ యూజర్ల అభిప్రాయాలను సేకరించి ఈ రిపోర్ట్‌‌‌‌ను విడుదల చేసింది. 16 నుంచి 64 ఏళ్ల మధ్య వయసున్న వారిని ఇందుకోసం ఎంచుకుంది. రోజువారీ అవసరాల కోసం అంటే ఫుడ్‌‌‌‌, గ్రోసరీ డెలివరీ కోసం  85 శాతం మంది రెస్పాండెంట్లు క్విక్ కామర్స్ యాప్స్‌‌‌‌ను వాడుతున్నారు. కానీ, ప్రీమియం ప్రొడక్ట్‌‌‌‌లను కొనేందుకు 50 శాతం మంది  ఫిజికల్ స్టోర్ల వైపు మొగ్గు చూపారు.  క్లాత్స్‌‌‌‌, యాక్సెసరీల కోసం ఈ–కామర్స్ ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌కే 75 శాతం మంది ఓటేశారు. 

రూ.83 వేల కోట్లకు క్విక్‌‌‌‌ కామర్స్ సైజ్‌‌‌‌

గ్లోబల్‌‌‌‌గా ఇలాంటి ట్రెండే చూస్తున్నామని మెటా ఇండియా డైరెక్టర్ (యాడ్స్‌‌‌‌) అరుణ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మొత్తం ఈ–కామర్స్‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌లో క్విక్ కామర్స్ మరింత వేగంగా విస్తరిస్తోంది. గత రెండేళ్లలో ఈ సెగ్మెంట్‌‌‌‌లో పోటీ బాగా పెరిగింది. రెడ్‌‌‌‌సీర్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్ ప్రకారం, ఇండియాలో క్విక్ కామర్స్ సెక్టార్ సైజ్‌‌‌‌ ప్రస్తుతం ఉన్న 3.34 బిలియన్ డాలర్ల (రూ.28 వేల కోట్ల) నుంచి  ‌‌‌‌‌‌‌‌2029 నాటికి  9.95 బిలియన్ డాలర్ల (సుమారు రూ.83 వేల కోట్ల) కు చేరుకుంటుందని అంచనా. 

టైర్‌‌‌‌‌‌‌‌ 2, టైర్ 3 సిటీలలో ఆన్‌‌‌‌లైన్ షాపింగ్  ట్రెండ్‌‌‌‌ గురించి  తెలుసుకునేందుకు మెటా సపరేట్‌‌‌‌గా ఓ సర్వే చేసింది. ఇందుకోసం పట్టణాల్లో నివసిస్తున్న 2,182 మంది ఆన్‌‌‌‌లైన్ యూజర్ల నుంచి అభిప్రాయాలను సేకరించింది. టైర్‌‌‌‌‌‌‌‌ 2,  3 సిటీలలో   ఫ్యాషన్, ఫుడ్, బ్యూటీ ప్రొడక్ట్‌‌‌‌లు, మొబైల్స్‌‌‌‌ను కొనేందుకు  వినియోగదారులు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు.   జ్యుయెలరీ, యాక్సెసరీస్‌‌‌‌, పెద్ద ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌‌‌‌లు, హోమ్ ఫర్నిచర్‌‌‌‌‌‌‌‌ వంటి ప్రొడక్ట్‌‌‌‌ల కొనుగోళ్లు కూడా ఊపందుకున్నాయి. వినియోగదారులు సోషల్ మీడియా ద్వారా ప్రొడక్ట్‌‌‌‌లను గుర్తిస్తున్నారు. సుమారు 68 శాతం మంది వినియోగదారులు సోషల్‌‌‌‌ మీడియాలో ప్రొడక్ట్‌‌‌‌ల గురించి తెలుసుకున్నామని చెప్పారని  మెటా సర్వే పేర్కొంది.