మంచిర్యాల, వెలుగు : జిల్లాలోని ఆటో కార్మికులు, వారి కుటుంబీలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్టు గర్మిళ్ల లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గాజుల ముఖేశ్ గౌడ్‌తెలిపారు. గర్మిళ్ల లయన్స్ క్లబ్, హెల్పింగ్ హాండ్స్ ఎన్జీవో, మంచిర్యాల సీసీహెచ్ఎస్1992 బ్యాచ్‌తో పాటు జిల్లా ఆటో ఓనర్స్అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి ఐ హాస్పిటల్ సౌజన్యంతో ఆపరేషన్లు చేస్తున్నట్టు చెప్పారు.
ఐ హాస్పిటల్డాక్టర్ మదేకర్ ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల బస్టాండ్ఎదురుగా ఉన్న ఓ ఫంక్షన్హాల్లో కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. 200 మంది పేర్లు నమోదు చేసుకోగా, కంటి ఆపరేషన్లకు 60 మందిని ఎంపిక చేశారు. త్వరలోనే జిల్లావ్యాప్తంగా కంటి వైద్య శిబిరాలు, మెగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని ముఖేశ్ గౌడ్ తెలిపారు.