మొదటి వారంలో ఎఫ్‌‌‌‌‌‌‌‌పీఐల పెట్టుబడులు.. రూ.24,454 కోట్లు..

న్యూఢిల్లీ:  గత రెండు నెలలుగా మార్కెట్‌‌‌‌‌‌‌‌లో షేర్లను అమ్ముతున్న ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌పీఐలు), ఈ నెల మొదటి వారంలో నికర అమ్మకందారులుగా మారారు.  నికరంగా రూ.24,454 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మిడిల్ ఈస్ట్‌‌‌‌‌‌‌‌లో టెన్షన్స్‌‌‌‌‌‌‌‌  తగ్గడంతో  పాటు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లకు మరోసారి కోత పెడుతుందనే అంచనాలతో  ఇండియన్ స్టాక్ మార్కెట్ గత ఐదు సెషన్లుగా లాభాల్లో కదిలింది. ఈ ఏడాది నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎఫ్‌‌‌‌‌‌‌‌పీఐలు నికరంగా రూ.21,612 కోట్లను, అంతకు ముంద నెలలో  నికరంగా రూ.94,017 కోట్లను మార్కెట్‌‌‌‌‌‌‌‌ నుంచి విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకున్నాయి.

 కానీ, సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం నికరంగా రూ.57,724 కోట్లను  ఇన్వెస్ట్ చేశాయి. ఈ నెల మొదటి వారంలో వచ్చిన ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లను కూడా కలుపుకుంటే ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎఫ్‌‌‌‌‌‌‌‌పీఐలు నికరంగా రూ.9,435 కోట్లను  స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెల మొదటి వారంలో ఎక్కువగా ఐటీ షేర్లను కొనుగోలు చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు డెట్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో రూ.1.07 లక్షల కోట్లను ఎఫ్‌‌‌‌‌‌‌‌పీఐలు ఇన్వెస్ట్ చేశారు.