ఉమ్మడి ఆదిలాబాద్ లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

నెట్​వర్క్, వెలుగు: భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ 80వ జయంతి వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. దేశాన్ని ప్రగతి బాటలో నడిపించి సాంకేతిక విప్లవంతో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా పునాదులు వేసిన మహా నేత రాజీవ్​ గాంధీ అని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​అన్నారు. కాసిపేట మండల కేంద్రంలోని రాజీవ్​గాంధీ విగ్రహానికి పూలమాలమాలలు వేసి నివాళులర్పించారు. 

నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ వేణు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు సుధాకర్ ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. రాజీవ్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. కాగజ్ నగర్​లో కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్​చార్జి రావి శ్రీనివాస్ అధ్వర్యంలో, మందమర్రి, రామకృష్ణాపూర్(క్యాతనపల్లి)​లో కాంగ్రెస్​ పార్టీ టౌన్ ​ప్రెసిడెంట్లు నోముల ఉపేందర్​గౌడ్​, పల్లె రాజు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.