ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

నెట్​వర్క్, వెలుగు: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ అని నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడిపల్లి భీంరెడ్డి, పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నాందేడపు చిన్ను అన్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని ఇందిరమ్మ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.

దేశంలో అనేక రకాల సంస్కరణలు తీసుకువచ్చిపేదరిక నిర్మూలనకు కృషి చేశారని కొనియాడారు. మందమర్రి, క్యాతనపల్లి (రామకృష్ణాపూర్) మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ టౌన్ ​ప్రెసిడెంట్లు ఉపేందర్ ​గౌడ్, పల్లె రాజు ఆధ్వర్యంలో వేర్వేరుగా వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్​పార్టీ ఆఫీసుల్లో ఇందిరా గాంధీ ఫొటోకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సీనియర్​లీడర్లు సొతుకు సుదర్శన్, గోపతి రాజయ్య, మున్సి పల్ ​వైస్​ చైర్మన్​ సాగర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆమె ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. బెల్లంపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయం ఆవరణలో జరిగిన వేడుకల్లోఎమ్మెల్యే వినోద్, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాభవన్​లో నియోజకవర్గ ఇన్​చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.