మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ గాజుల ముఖేశ్‌గౌడ్, సీనియర్ లీడర్ బెల్లంకొండ మురళిమంగళవారం బీజేపీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు ఆధ్వర్యంలో ఢిల్లీలో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. వారివెంట ఆదిలాబాద్ఎంపీ గోడం నగేశ్, నాయకులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, మెట్టుపల్లి జయరామారావు, రవీందర్ రావు ఉన్నారు.
టీడీపీ యూత్ కార్యకర్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ముఖేశ్ గౌడ్ దివంగత మాజీ ఎమ్మెల్యే గోనె హన్మంతరావు నాయకత్వంలో వివిధ హోదాల్లో పనిచేశారు. రెండుసార్లు మున్సిపల్ కౌన్సిలర్‌గా, గత టర్మ్‌లో బీఆర్ఎస్ నుంచి వైస్ చైర్మన్‌గా ప్రాతినిధ్యం వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు.