సంగారెడ్డి, వెలుగు : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవిని ఏడాది లోపే వదులుకున్న మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత ఆర్. సత్యనారాయణ గురువారం కాంగ్రెస్ లో చేరారు. సిద్దిపేటలో జరిగిన ఎన్నికల సభ సందర్భంగా హెలీప్యాడ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసినా బీఆర్ఎస్ లో గుర్తింపు లేకుండా పోయిందన్నారు.
తన రాజకీయ భవిష్యత్ కాంగ్రెస్ లో బాగుంటుందని ఆశించి సీఎం సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఈ చేరికలో సత్యనారాయణ వెంట బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు ఎ.నర్సింహారెడ్డి, జిట్టే రవి, అమీనొద్దీన్, జి.పండరి, అనంతసాగర్ ప్రభాకర్, లక్ష్మణ్, నూతన్ కుమార్, రాజమౌళిఉన్నారు.