చేర్యాల,వెలుగు: ఇచ్చిన మాట ప్రకారం 2లక్ష ల రుణ మాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు, రైతులు సీఎం రెవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేసినందుకు చేర్యాల పట్టణంలో గాంధీ చౌరస్తా నుంచి మార్కెట్ యార్డు వరకు ర్యాలీ నిర్వహించారు, ర్యాలీ అనంతరం సభలో మాట్లాడారు.
రైతు రుణమాఫీ దేశానికి తెలంగాణ మోడల్ ఆదర్శంగా ఉండబోతుంది. ఎనిమిది నెలల్లో రుణమాఫీ హామీని నెరవేర్చి దేశంలోనే తలెత్తుకునేలా ఉన్నామని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చర్మెన్ శ్వేతా వెంకటా చారి, జీవన్ రెడ్డి, మాజీ జడ్పి ఫ్లోర్ లీడర్ గిరి కొండల్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు కొమ్ము రవి, ఎం. శ్రీనివాస్, ఎం. మల్లేశం, కే. సాయిలు గౌడ్, పి. ఆగం రెడ్డి, చంద్రయ్య, శ్రీనివాస్, కౌన్సిలర్లు నరేందర్, లింగం. లీలా సంజీవులు ఉన్నారు.
అర్హులైన రైతులందరికీ రుణమాఫీ
నారాయణ్ ఖేడ్ : అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అవుతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి అన్నారు. మంగళవారం క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మాట్లాడారు. పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోకపోగా, ప్రస్తుతం రైతులకు మంచి జరుగుతుంటే వాళ్ల రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను, ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు.