నారాయణ్ ఖేడ్,వెలుగు: రైతుల వద్ద ఉన్న ప్రతీ ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఖేడ్ మండలంలోని ర్యాకల్‌లో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేశాక 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. గంగాపూర్‌లో పీఏసీఎస్ సొసైటీ ఉన్నా కొనుగోళ్లకు అనుమతి ఇవ్వకుండా సంజీవన్‌రావుపేట్ సొసైటీకి అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు.
తాము ఆందోళన చేస్తామని ప్రకటించడంతో పలు కేంద్రాల్లో రాత్రికి రాత్రే కొనుగోళ్లు ప్రారంభించారన్నారు. ఆయన వెంట జడ్పీటీసీ లక్ష్మీబాయి, రవీందర్‌నాయక్, మాజీ సర్పంచ్ అంజన్న, నాయకులు గోపాల్‌రెడ్డి, మల్‌రెడ్డి, పండరి, తుకారాం, సాయిలు, కృష్ణ, నర్సింహులు, దశరత్, విఠల్, పండరి, దశరత్ ఉన్నారు