గోబెల్స్ ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు : హరీశ్​ రావు

సిద్దిపేట, వెలుగు: బీఆర్ఎస్ పై బీజేపీ ఫేక్ వీడియోలతో  చేస్తున్న  గోబెల్స్ ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలో  బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించి మాట్లాడారు.  వెంకట్రామిరెడ్డి మచ్చలేని మనిషని, అందరూ ఆస్తులు సంపాదించుకోవాలనుకుంటే  ఆయన మాత్రం ట్రస్ట్ ఏర్పాటు చేసి తన  ఆస్తి పంచి పెడతాననిఅంటూన్నారని  ఇలాంటి మంచి మనసున్న మారాజు ను భారీ మెజార్టీ తో గెలిపించాలని పిలుపునిచ్చారు.

బీజేపీ అభ్యర్థి పై ఈసీకి ఫిర్యాదు చేయడమే కాకుండా రేపు అన్ని  పీఎస్​లలో కేసు పెడతామన్నారు.  కోమటి చెరువు వద్ద మార్నింగ్ వాకర్స్ ను, లాల్ కమాన్ ప్రాంతంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. బుధవారం రాత్రి చిన్నకోడూరు మండలంలో హరీశ్​ రావు, వెంకట్రామిరెడ్డి రోడ్ షో నిర్వహించారు.

వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం

ములుగు:మెదక్​బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎఫ్ డీసీ  చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మామిడ్యాల, బండతిమ్మాపూర్ గ్రామాల్లో మండల అధ్యక్షుడు జహంగీర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, జుబేర్ పాషా, అర్జున్ గౌడ్, గణేశ్ గుప్తా, భూపాల్ రెడ్డి, బాల్ రెడ్డి, నరేశ్ గౌడ్, బాపురెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, లింగారెడ్డి, రాజేందర్ రెడ్డి, పల్లె బాబు పాల్గొన్నారు.

వెంకట్రామిరెడ్డి భార్యా, కొడుకు ప్రచారం 

మెదక్:మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తరపున  ఆయన భార్య  ప్రణీతారెడ్డి, కొడుకు భరత్ రాజ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు సులోచన ప్రభురెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాస్,  కృష్ణా రెడ్డి, మధు,  కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఆయా వార్డుల్లో  ఇంటింటి ప్రచారం చేశారు. పోస్టర్లు, కరపత్రాలు పంచి కారు గుర్తుపై ఓటు వేసి వెంకట్రామిరెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు.