సిద్దిపేట, వెలుగు: మోదీ మత విద్వేషాలు రెచ్చగొట్టినా, రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడినా అవి ఎన్నికల కమిషన్ కు కనిపించవని..కానీ కేసీఆర్ప్రశ్నిస్తూ గట్టిగా కొట్లాడుతుంటే మాత్రం ఆయన ప్రచారాన్ని ఆపుతున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
బుధవారం రాత్రి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు రోడ్ షో మాట్లాడారు. కేసీఆర్బస్సు యాత్ర చేస్తానంటే గజ గజ వణుకుతున్నారని , రెండు రోజులు ప్రచారాన్ని అపినంత మాత్రాన ఏమవుతుందని, ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి దిగజారి ప్రవర్తిస్తున్నారని, ఆయన కేసీఆర్ను అంటే మనందరినీ అన్నట్టేనని, కేసీఆర్లేకుంటే తెలంగాణ వచ్చేదా జిల్లాలు అయ్యేవా అని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పి కారు గుర్తుకు ఓటెయ్యాలని పిలుపునిచ్చారు.