రేఖా నాయక్​కు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం

  •     విక్టోరియా పార్లమెంట్​లో సన్మానం

ఆసిఫాబాద్, వెలుగు : ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్​కు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం లభించింది. విక్టోరియా రాష్ట్ర పార్లమెంట్​లో ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా అధ్వర్యంలో భారత స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రేఖా నాయక్​తో పాటు అక్కడి మంత్రులు హజరయ్యారు. తెలంగాణలో రేఖా నాయక్ చేస్తున్న ప్రజా సేవను గుర్తించి ప్రశంసాపత్రం అందజేశారు.

మహిళా మంత్రి నటాలి హచిన్స్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ రాజ్ సైని రేఖా నాయక్​ను సన్మానించారు. ప్రశంశాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ రాజ్ సైనీ, విక్టోరియన్ మల్టీకల్చరల్ కమిషన్ సలహాదారు రాజు వేముల, ఆస్ట్రేలియా లేబర్ పార్టీ నాయకుడు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.