కాంగ్రెస్ లోకి కాగజ్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ మున్సి పల్ మాజీ చైర్మన్ మహమ్మద్ సద్దాం హుస్సేన్ శనివారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. బీఆర్ఎస్ నుంచి నాలుగేండ్ల పాటు మున్సిపల్ చైర్మన్ గా కొనసాగిన సద్దాం హుస్సేన్ కొన్ని నెలలుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్  కాంగ్రెస్ లో చేరాలని ఇటీవల ఆయనతో మంతనాలు జరిపారు. ఈ క్రమంలో శనివారం దండే విఠల్ తో కలిసి హైదరాబాద్​లోని పార్టీ ఆఫీస్ లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.