ప్రైవేట్ ఆస్పత్రుల్లోని క్యాంటిన్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు

మంచిర్యాల జిల్లాలో ఫుడ్​ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు.  జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్​ ఆస్పత్రుల్లో క్యాంటిన్లను తనిఖీ చేశారు.  మంచిర్యాల బస్టాండ్​ ఏరియాలోని A1 హోటల్ పై ఫిర్యాదు రావడంతో తనిఖీలు చేసినట్లు మంచిర్యాల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తెలిపారు. 


 నాశిరకంగా ఉన్న ఆహార పదార్థాలను గుర్తించిన అధికారులు.. ల్యాబ్​కు  పంపామని.. రిపోర్టు రావడంతో ఆస్పత్రిలో హోటల్​ నడిపే యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.  ఇంకా మంచిర్యాల జిల్లాలో అన్ని హోటల్స్​ ఫుడ్​ లైసెన్స్​ కలిగి ఉండాలన్నారు.  నియమాలకు విరుద్దంగా.. అక్రమంగా హోటల్స్​.. ఫుడ్​ స్టాల్స్​ పై చట్టరీత్య  చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.