తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో 20 విద్యార్థినులకు అస్వస్థత

మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్ లో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఉదయం అల్పాహారం దొడ్డు ఉప్మా తిన్న విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకున్నారు. దీంతో వెంటనే  20 మంది విద్యార్థులను రామయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సిబ్బంది.

ముగ్గురికి తీవ్రస్వస్థతకు గురి కాగా..  మరో 17 మందికి స్వల్ప అస్వస్థతకు  గురయ్యారు. వీరిని పరీక్షించిన వైద్యులు ఇంటికి పంపించారు.   ముగ్గురు విద్యార్థినీలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  మరో 20 మంది విద్యార్థులు తమకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పడంతో  వారికి  వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.