గణేశ్ మండపం వద్ద ముస్లింల అన్నదానం

లక్సెటిపేట, వెలుగు: లక్సెట్టిపేట పట్టణం కోర్టు సమీపంలో శివశంకర్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడు వద్ద ఆదివారం ముస్లింల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. స్థానిక సీఐ నరేందర్, ఎస్సై సతీశ్​హాజరై ప్రారంభించారు. సీఐ మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా ముస్లింలు అన్నదాన కార్యక్రమం చేపట్టడం హర్షనీయమన్నారు. ఐకమత్యంగా ఉంటూ పండగలు శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు.