ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన పెన్ గంగా నది రైతుల పాలిట శాపంగా మారింది. భీంపూర్, జైనథ్, బేల మండలాల్లో పెన్ గంగా నది పరివాహక ప్రాంతాల్లో బ్యాక్ వాటర్ తో వందలాది ఎకరాలు నీట మునిగాయి.
దీంతో రైతులు వేసిన పత్తి, కంది పంటలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు నాశనం కావడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
– వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్