వేమనపల్లి మండలంలో గర్భిణీకి వరద కష్టాలు

బెల్లంపల్లిరూరల్, వెలుగు : ప్రాణహితకు వరద మొదలు కావడంతో వేమనపల్లి మండలంలో రాకపోకలకు కష్టాలు మొదలయ్యాయి. జాజులపేట గ్రామానికి చెందిన గర్భిణీ దందెర భారతికి ఆగస్టు మొదటి వారంలో డెలివరీ తేదీని డాక్టర్లు నిర్ణయించారు. ముందు జాగ్రత్తగా ఆమెను చెన్నూర్ ​ప్రభుత్వాస్పత్రికి ఆటోలో వైద్య సిబ్బంది తరలిస్తుండగా

మార్గమధ్యలో సుంపుటం అట్టలొర్రే వంతెన వద్ద వరద పోటెత్తింది. దీంతో ఎస్సై శ్యామ్, వైద్య సిబ్బంది బాపు, శారద కలిసి కాలినడకన జాగ్రత్తగా గర్భిణీని వంతెన దాటించారు. అనంతరం అక్కడే ఉన్న అంబులెన్స్​లో​ చెన్నూర్​కు తరలించారు.