Floater Credit Cards: ఫ్లోటర్ క్రెడిట్ కార్డు గురించి తెలుసా.. ఏవిధంగా పనిచేస్తుంది..ఎవరికి అవసరమంటే..

ప్రస్తుత పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు వాడని వారంటూ లేరు. బ్యాంకులు పిలిచి మరీ ఇస్తుండటంతో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగిపోయింది. లక్షల్లో లిమిట్ ఇస్తున్నాయి. రకరకాల క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి.. ఇటీవల కాలంలో ఫ్లోటర్ క్రెడిట్ కార్డులు అని బ్యాంకులు వర్టికల్ క్రెడిట్ కార్డులను కూడా జారీ చేస్తున్నాయి. ఇంతకీ ఫ్లోటర్  క్రెడిట్ కార్డు అంటే ఏమిటీ..ఫ్లోటర్ క్రెడిట్ కార్డు ఎలా పనిచేస్తుంది..ఇది ఎవరికి ఉపయోగం..  బిల్లులు ఎలా చెల్లించాలి వంటి విషయాలు తెలుసుకుందాం.. 

ఫ్లోటర్ క్రెడిట్ కార్డు.. దీనినే సప్లిమెంటరీ క్రెడిట్  కార్డు అని కూడా అంటారు. ఇప్పుడున్న క్రెడిట్ కార్డుకు అడిషనల్ కార్డు అన్నమాట.. దీంతో క్రెడిట్ లిమిట్ ను ఇతరులతో పంచుకోవచ్చు. 

ఫ్యామిలీలో భార్య, లేదా భర్తకు ఈ ఫ్లోటర్ క్రెడిట్ కార్డును జారీ చేస్తారు. ఇక ఫ్యామిలీ మొత్తం క్రెడిట్ లిమిట్ ను వినియోగించుకోవచ్చు. ఈ కార్డు ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. క్రెడిట్ లిమిట్ ను ప్రైమరీ కార్డుతో షేర్ చేసుకోవచ్చు. 

ఫ్లోటర్ క్రెడిట్  కార్డు ఎలా పొందవచ్చు.. 

ప్లోటర్ క్రెడిట్ కార్డు అన్ని బ్యాంకులు జారీ చేస్తున్నాయి. మీ పేరున గానీ, మీ ఫ్యామిలీ మెంబర్ పేరున గానీ ఇస్యూ చెస్తారు. ఇది ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ కార్డు.. దీనికి ఎలాంటి డాక్యుమెంట్స్, వెరిఫికేషన్  అవసరం లేదు. ఇది మీ ప్రైమరీ కార్డు బేసిస్ మీదనే ఇస్తారు. 

ఫ్లోటర్ క్రెడిట్ ఎలా పనిచేస్తుందంటే.. 

ఉదాహరణకు మీకు క్రెడిట్ లిమిట్ రూ. 10 లక్షలు ఇచ్చినట్లయితే.. ఆ క్రెడిట్ లిమిట్ ను రెండు క్రెడిట్ కార్డుల మధ్య షేర్ చేసుకోవచ్చు. ఈ షేరింగ్ లిమిట్ తో కొత్త క్రెడిట్ కార్డ్ జారీ చేయడం బ్యాంక్ అంతర్గత పాలసీ మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది. ప్రస్తుత క్రెడిట్ కార్డు లిమిట్ మీద ఆధారపడి కొత్త ఫ్లోటర్ క్రెడిట్ కార్డును బ్యాంకులు  జారీ చేస్తారు. 

ఫ్లోటర్ కార్డ్ ఎవరికి అవసరం.. 

ఫ్లోటర్ క్రెడిట్ కార్డ్ కూడా అన్ని ఇతర కార్డ్‌ల మాదిరిగానే అవసరాల వినియోగించే కార్డు. మీరు తరచుగా ప్రయాణిస్తున్నట్లయితే లేదా మీ కుటుంబానికి దూరంగా ఉంటున్నా.. ఫ్లోటర్ క్రెడిట్ కార్డ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు మీ ఖర్చుల కోసం ప్రాథమిక కార్డ్‌ని ఉపయోగించడం కొనసాగించినప్పటికీ, అదనపు కార్డ్‌తో ఇంటికి అవసరమైన కొనుగోళ్లను చేయడానికి ఇది మీ జీవిత భాగస్వామికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 

బిల్లులు చెల్లించడం ఎలా .. 

ఇక వాడుకు క్రెడిట్ బిల్లును ఎలా చెల్లించాలంటే.. ప్రైమరీ కార్డు బిల్లులు, ఫ్లోటర్ క్రెడిట్ కార్డు బిల్లులు సపరేట్ గా చెల్లించాల్సి ఉంటుంది. రెండు కలిపి చెల్లించకూడదు. ఏ కార్డు ఎంత అవుట్ స్టాండింగ్ బిల్లు ఉంటుందో అంతే అదే కార్డుపై పే చేయాలి. ఒకదాని బిల్లు మరోదానికి చెల్లించడం గానీ, ఎక్కువ చెల్లించడం గానీ జరిగితే అడ్జస్ట చేయబడదు. 

ALSO  READ | Credit Card Limit: లిమిట్ను మించి మీ క్రెడిట్ కార్డు వాడుకోవచ్చు..ఎలా అంటే..