ఎన్​సీఈఆర్​టీతో ఫ్లిప్​కార్ట్​ జోడీ

హైదరాబాద్​, వెలుగు : ఈ–కామర్స్ కంపెనీ ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్​సీఈఆర్​టీ)తో  అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా  దేశ వ్యాప్తంగా ఎన్​సీఈఆర్​టీ పుస్తకాలు అంతటా అందుబాటులోకి వస్తాయి. టైర్, 2  టైర్ 3 నగరాల్లోని విద్యార్థులు ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్ ద్వారా పుస్తకాలను కొనుక్కోవచ్చు. 

 కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్,  జయంత్ చౌదరి, రజనీష్ కుమార్, ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్ అధికారుల సమక్షంలో సంతకం కార్యక్రమం  ఢిల్లీలోని ఎన్​సీఈఆర్​టీ కార్యాలయంలో జరిగింది.   ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ,  ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్ తో అందరూ ఎన్​సీఈఆర్​టీ పుస్తకాలను సులువుగా కొనుక్కోవచ్చని అన్నారు.