ఆర్డర్ క్యాన్సలేషన్ ఫీజుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం ఫ్లిఫ్ కార్ట్ స్పందించింది. ఫ్లిప్ కార్డ్ ఫ్లాట్ ఫాంలో ఏదైన వస్తువు ఆర్డర్ చేసి క్యాన్సల్ చేస్తే రూ. 20లు వసూలు చేస్తుందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ బాగా వైరల్ అయింది..దీనిపై ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం స్పందిస్తూ..ఆర్డర్ క్యాన్సలేషన్ రద్దుఫీజు ఇప్పటిది కాదు.. చాలారోజులుగా ఉంది.. ఆర్డర్ చేసి 24 గంటల తర్వాత రద్దు చేస్తూ క్యాన్సలేషన్ ఫీజు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
ఫ్లాట్ ఫాం ఆర్డర్ల రద్దుపై రూ. 20 లు వసూలు చేస్తున్నారని టిప్ స్టర్ అబిషేక్ యాదవ్ అనే యూజర్ Xలో ఓ స్క్రీన్ షాట్ ను షేర్ చేయడంతో వైరల్ అయింది.. ఫ్లిఫ్ కార్ట్ వినియోగదారులు ఈ పోస్ట్ చూసి ఆశ్చర్యపోయారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్లిప్ కార్ట్ యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో చర్చలకు దారితీసింది.
ALSO READ | ఇంకో ఐదేళ్లలో అమెజాన్ మొత్తం ఎగుమతులు 6.7 లక్షల కోట్లు
గత రెండేళ్లుగా ఆర్డర్ రద్దుపై 20రూపాయలు వసూలు చేస్తున్నామని..అయితే 24 గంటల తర్వాత ఆర్డర్ చేసిన వాటిపై మాత్రమే ఛార్జీలు వసూలు చేస్తున్నామని సంస్థ చెబుతోంది. అమ్మకందారులు, లాజిస్టిక్స్ పార్టినర్స్ ప్రాసెస్ చేయడం, షిప్ మెంట్ కోసం ఆర్డర్ ను సిద్దం చేయడం కోస అయ్యే ఖర్చులను కవర్ చేయడానికి చార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలిపింది. కంపెనీ నిరంతరాయంగా సేవలందించాలంటే ఈ ఛార్జీలు అవసరమని చెప్పకనే చెప్పింది.