వర్గీకరణ పేరుతో దళితుల మధ్య చిచ్చు : మాల మహానాడు నాయకులు

ఖానాపూర్, వెలుగు: వర్గీకరణ పేరుతో  కేంద్ర ప్రభుత్వం దళితుల మధ్య చిచ్చు పెడుతోం దని మాల మహానాడు నాయకులు అన్నారు. శనివారం ఖానాపూర్ పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలో మాల మహానాడు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ.. మాలలు ఐక్యంగా పోరాటాలు చేసి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

ఎస్సీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లతోపాటు ప్రవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 1న హైదారాబాద్​లో మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభకు మాలలు పెద్ద ఎత్తున తరలివచ్చి సక్సెస్ చేయాలని పిలుపనిచ్చారు. నాయకులు రాజేశ్వర్, నేత శ్యామ్, రాజశేఖర్, అశోక్, సతీశ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.