గంజాయి సాగు చేస్తున్న వ్యక్తికి ఐదేండ్ల జైలు.. రూ.లక్ష జరిమానా

ఆసిఫాబాద్, వెలుగు: గంజాయి సాగు  కేసులో నిందితుడికి ఐదేండ్ల జైలుతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్  జిల్లా సెషన్స్ కోర్ట్  ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్​ మంగళవారం తీర్పు ఇచ్చారు. ఆసిఫాబాద్  సీఐ సతీశ్​ తెలిపిన వివరాల  ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. ఆసిఫాబాద్ మండలం బాబాపూర్  గ్రామానికి చెందిన చునార్కర్  ముకుంద్​రావు తన చేనులో పత్తితో పాటు గంజాయిని సాగు చేస్తుండగా, 2021 అక్టోబర్  11న అప్పటి ఎస్ఐ చుంచు భూమన్న దాడి చేయగా 50 గంజాయి మొక్కలు పట్టుబడ్డాయి. 

అప్పటి సీఐ అశోక్  ఎన్డీపీఎస్  చట్టం కింద కేసు నమోదు చేశారు. కోర్టులో చార్జ్ షీట్  దాఖలు చేయగా, సీడీవో బాపురావు కోర్టులో సాక్షులను హాజరుపరిచారు. పీపీ జగన్మోహన్​రావు వాదనలు వినిపించగా, నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష ఖరారు చేస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ఆసిఫాబాద్  డీఎస్పీ సదయ్య, సీఐ సతీశ్, లైజనింగ్  ఆఫీసర్  నారాయణను ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు.