అతివేగానికి ఐదుగురు బలి

ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి.. వీరిలో ముగ్గురు చిన్నారులు 
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద హై వేపై అర్ధరాత్రి ఘటన
 

గుడిహత్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై గుడిహత్నూర్ వద్ద కారు బోల్తా పడడంతో  ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందగా.. ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ టౌన్ టీచర్స్ కాలనీకి చెందిన సయ్యద్ మొయిజొద్దీన్ సోమవారం తన ఫ్యామిలీతో కలిసి కారులో భైంసాకు వెళ్లారు. అక్కడ ఓ ఫంక్షన్ కు హాజరైన అనంతరం అదేరోజు రాత్రి 9.15 గంటలకు ఆదిలాబాద్ కు వెళ్తున్నారు.

గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద అర్ధరాత్రి11.30 గంటలకు కారు స్పీడ్ గా వెళ్తూ.. మూలమలుపు వద్ద బోల్తా పడింది. సయ్యద్ మొయిజొద్దీన్ (67), అతని అల్లుడు ఖాజా మొయినొద్దీన్(43), ముగ్గురు మనవళ్లు మహ్మద్ ఫరీదొద్దీన్(14), మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉస్మానుద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(8), సయ్యద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహమ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ(5)  అక్కడికక్కడే మృతిచెందారు.  మిగతా కుటుంబసభ్యులైన సయ్యద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయేషా అఫ్రిన్, మహమ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాదుద్దీన్, ఇక్రా ఫాతిమా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటనను అటుగా వెళ్లే వాహనదారులు చూసి పోలీసులు, అంబులెన్స్ కు సమాచారం అందించారు. అనంతరం గాయడిన ముగ్గురిని రిమ్స్ కు తరలించారు.  మంగళవారం ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ గౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఆలం పరిశీలించారు. 

రెండు బైక్ లు ఢీ..మరో ముగ్గురు  

మృతుల్లో భార్యాభర్తలు
ఖమ్మం జిల్లాలో ఘటన
 

కారేపల్లి, వెలుగు: రెండు బైక్ లు ఎదురెదురుగా ఢీకొనడంతో స్పాట్ లో ముగ్గురు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. కారేపల్లి మండలం గుట్ట కింది గుంపు గ్రామానికి చెందిన ఉండం సూర్యనారాయణ(50), సుగుణ(45) దంపతులు మంగళవారం బైక్ పై  ఇల్లందుకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. సింగరేణి సోలార్ ప్లాంట్ లో ఇంజనీర్ అయిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన నక్కా వెంకటేశ్(36), మరో యువకుడు ధారావత్ రాజుతో కలిసి బైక్ పై కారేపల్లి నుంచి ఇల్లందుకు పోతుండగా.. బొడ్రాసుకుంట సమీపంలోని ఆంజనేయస్వామి గుడి మూల మలుపు వద్ద స్పీడ్ గా వచ్చి రెండు బైక్ లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.  దీంతో సూర్యనారాయణ, సుగుణ దంపతులతో పాటు వెంకటేశ్  తీవ్రగాయాలతో స్పాట్ లో మృతిచెందారు. అల్యాతండాకు చెందిన రాజుకు తీవ్ర గాయాలు కాగా.. ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. గట్ట కింది గుంపు గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కారేపల్లి పోలీసులు తెలిపారు.

మహిళా కూలీలపై లారీ బోల్తా..

ముగ్గురికి గాయాలు..ఒకరి పరిస్థితి విషమం 

పాలకుర్తి :  లారీ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరుకు చెందిన ఉప్పునూతుల రమ, రమ్య తల్లి కూతుళ్లు. కాగా.. గ్రామానికి చెందిన మరో మహిళ బెల్లి గౌరమ్మ తో కలిసి మంగళవారం ఉదయం స్టేషన్​ఘన్​పూర్​రోడ్డులో వ్యవసాయ కూలి పనులకు వెళ్తున్నారు. యూపీకి చెందిన లారీ ఫైబర్ ​డోర్ ​మెటీరియల్​తో  స్టేషన్ ​ఘన్​పూర్ ​మీదుగా విజయవాడకు స్పీడ్ గా వెళ్తూ గూడూరు శివారులో మూల మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది.  అప్పుడే అటునుంచి వెళ్తున్న రమ, రమ్య గౌరమ్మపై లారీలోని ఫైబర్​డోర్ ​మెటీరియల్​ పడడడంతో తీవ్రంగా గాయపడ్డారు. మరో మహిళ రమ్య లారీ క్యాబిన్​లో ఇరుక్కుపోయింది. ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్​ జేసీబీ సాయంతో ఆమెను బయటకు తీయించారు.  బాధితులను వెంటనే అంబులెన్స్​లో హనుమకొండ హాస్పిటల్​కు తరలించారు. రమ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.