సిద్దిపేట జిల్లాలో తొలి రోజు టెట్ పరీక్ష ప్రశాంతం

సిద్దిపేట రూరల్, వెలుగు; సిద్దిపేట జిల్లాలో తొలిరోజు టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీ తో పాటు, వెర్టాస్ ఇనిస్టిట్యూట్​లో టెట్​పరీక్షలు కొనసాగాయి. కాగా ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో ఓ అభ్యర్థి ఆలస్యంగా రావడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు.

 మార్నింగ్ సెషన్ లో ఇందూర్ కాలేజీలో 50 మంది అభ్యర్థులకు గాను 40 మంది హాజరవగా, మధ్యాహ్నం 51 మంది అభ్యర్థులకు 50 మంది హాజరవగా, ఒకరు ఆబ్సెంట్ అయ్యారు. కాలేజీ ప్రిన్సిపల్ వీపీ రాజు, అబ్జర్వర్ నాగభూషణం, టీసీఎస్​ఆఫీసర్ రాకేశ్, పీఆర్​వో రఘు పరీక్షలను సమీక్షించారు. ఈ నెల 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందే చేరుకోవాలని సూచించారు.

Latest news, Telugu news, Medak, Telangana News