పెద్దారెడ్డిపేట గ్రామంలో వైభవంగా సీతారాముల కల్యాణం

పుల్కల్, వెలుగు: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని పెద్దారెడ్డిపేట గ్రామంలో సీతారామచంద్రస్వామి ప్రథమ వార్షికోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి 108 కలశాలతో లక్ష్మణ సమేత సీతారాములకు అభిషేకం చేసి లక్ష పుష్పాలతో అర్చన చేశారు. అనంతరం వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో జోగిపేట శ్యామ్ ప్రసాద్ దంపతులు హోమం నిర్వహించి, సీతారాముల కల్యాణం జరిపించారు. 

ఉత్సవాలకు హాజరైన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలయ కమిటీ ఏర్పాట్లు చేశారు. మంతుర్ దుర్గయ్య అధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో యాదగిరి రెడ్డి, అంజయ్య, అనంతం, సుభాష్ చందర్, రమేశ్ పాటిల్, సుభాష్, మల్లేశం, ఆంజనేయులు, రాంచందర్ ఉన్నారు.