చిలప్ చెడ్, వెలుగు : పల్లె దవాఖానాలు అన్నీ ఓపెన్ చేయడంలేదని, చేసిన చోట సమయపాలన పాటించడం లేదని వైస్ ఎంపీపీ విశ్వంభర్ స్వామి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సుభాష్ రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై ఫైర్ అయ్యారు. సోమవారం ఎంపీపీ వినోద అధ్యక్షతన చిలప్ చెడ్ మండలం జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని చిట్కుల్, సోమక్కపేట్ పల్లె దవాఖానాల్లో కనీసం రెండు గంటలు సైతం సిబ్బంది ఉండడం లేదన్నారు.
దీనివల్ల ప్రజలకు వైద్య సేవలు అందకుండా పోతున్నాయన్నారు. నర్సాపూర్ నుంచి జోగిపేట్ కు ఎక్స్ ప్రెస్ బస్సు వేసి డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారని కోఆప్షన్ మెంబర్ షఫీ తెలిపారు. చిట్కుల్ కేజీబీవీ స్కూల్లో చదువుతున్న స్టూడెంట్స్కు తాగునీటి సౌకర్యం కల్పించి సమస్యలు పరిష్కరించాలని స్పెషల్ ఆఫీసర్ అంజలి కోరారు.