సిద్దిపేట టౌన్, వెలుగు: జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ రోడ్డులో గల బాలాజీ బార్ అండ్ రెస్టారెంట్ లో మంగళవారం షార్ట్ సర్క్యూట్వల్ల అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 8 గంటల సమయంలో మూసి ఉన్న బార్ నుంచి మంటలు రావడంతో స్థానికులు ఫైర్సిబ్బందికి సమాచారం అందించారు.
వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఖరీదైన మద్యం బాటిళ్లు దగ్ధమయ్యాయని, భారీగా ఆస్తి నష్టం జరిగిందని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బార్ యజమాని తెలిపారు.