గచ్చిబౌలిలో పే ఇన్‌‌‌‌స్టాకార్డ్ ఆఫీస్ ​ప్రారంభం

హైదరాబాద్, వెలుగు:  ఫిన్‌‌‌‌టెక్ కంపెనీ  పే ఇన్‌‌‌‌స్టాకార్డ్ హైదరాబాద్‌‌‌‌లోని గచ్చిబౌలిలో తన కొత్త ఆఫీసును గురువారం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ (బీఐఏసీ) ఇండియా పార్ట్‌‌‌‌నర్,  పే ఇన్‌‌‌‌స్టాకార్డ్ చైర్మన్, ఇన్వెస్టర్ పచ్చిపాల దొరస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పే  ఇన్‌‌‌‌స్టాకార్డ్ అనేది వ్యాపార బ్యాంకింగ్ ప్లాట్‌‌‌‌ఫాం. ఇది వ్యాపారాలకు తమ ఖాతాలు, చెల్లింపులు, ఇతర లావాదేవీలను ఒకే చోట నిర్వహించడానికి సహాయపడుతుంది. 

  కేవలం ఆరు నెలల్లో పేఇన్‌‌‌‌స్టాకార్డ్  లక్షకుపైగా కస్టమర్లను చేర్చుకుందని, వందకోట్లకుపైగా లావాదేవీలను ప్రాసెస్​ చేసిందని పే ఇన్‌‌‌‌స్టాకార్డ్  సీఈఓ సాయికృష్ణ అన్నారు. ఈ కొత్త ఆఫీసులో 25 మంది వరకు పనిచేస్తారని, 2025–-26 చివరి నాటికి తన సిబ్బంది సంఖ్యను 100కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పే ఇన్‌‌‌‌స్టాకార్డ్  చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నగేష్ కోటిపల్లి మాట్లాడుతూ చిన్న నగరాల నుంచి అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రతిభను రిక్రూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.