హైదరాబాద్, వెలుగు: ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ పెన్నెంట్ టెక్నాలజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పెన్నెంట్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ పెన్యాప్స్ లెండింగ్ ఫ్యాక్టరీ (పీఎల్ఎఫ్)ని బ్యాంకులో ప్రవేశపెట్టింది. దీనివల్ల హెచ్డీఎఫ్సీ లెండింగ్బిజినెస్ మరింత పెరుగుతుంది. లోన్ల జారీ సులువుగా మారుతుంది.
కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా లోన్ ప్రొడక్టులను అందించడం సాధ్యపడుతుంది. భవిష్యత్‌కు సన్నద్ధం కావడానికి తమ బ్యాంకు సాంకేతికంగా మరింత ఎదుగుతోందని హెచ్డీఎఫ్సీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రాజేశ్ అన్నారు.