జన్నారం,వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్ లోని ఇందన్ పెల్లి రేంజ్ లో ఎఫ్డీపీటీ శాంతారామ్ శుక్రవారం పర్యటించారు. రేంజ్ లోని గ్రాస్ ల్యాండ్ తో పాటు, అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులకు రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్ పనులను, చేపట్టబోయే పనులను తెలుసుకున్నారు.
జంతువుల సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని అదేశించారు. ఆయన వెంట మంచిర్యాల డీఎఫ్వో శివ్ ఆసీన్ సింగ్ ,ఇందన్ పెల్లి రేంజ్ ఆఫీసర్ హఫీజోద్దిన్తదితరులున్నారు.