ఇండియాలోకి పెరిగిన ఎఫ్‌‌‌‌‌‌‌‌డీఐలు..తెలంగాణలోకి రూ.13 వేల కోట్లు

  • ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ - సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 45 శాతం అప్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్‌‌‌‌‌‌‌‌– సెప్టెంబర్ మధ్య  ఇండియాలోకి 29.79 బిలియన్ డాలర్ల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్ (ఎఫ్‌‌‌‌‌‌‌‌డీఐలు) వచ్చాయి. కిందటి ఆర్థికసంవత్సరంలోని  ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన 20.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే 45 శాతం పెరిగాయి. డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఫర్ ప్రమోషన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) డేటా ప్రకారం,  సర్వీసెస్‌‌‌‌‌‌‌‌, కంప్యూటర్‌‌‌‌‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ హార్డ్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  టెలికం, ఫార్మా, ఆటోమొబైల్స్‌‌‌‌‌‌‌‌, కెమికల్స్‌‌‌‌‌‌‌‌ రంగాలు ఈ ఏడాది ఎఫ్‌‌‌‌‌‌‌‌డీఐలను బాగా ఆకర్షించాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని జులై–సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 13.6 బిలియన్ డాలర్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌డీఐలు వచ్చాయి.

కిందటి ఆర్థిక సంవత్సరంలోని సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన 9.52 బిలియన్ డాలర్లతో పోలిస్తే  43 శాతం పెరిగాయి. అదే ఏప్రిల్‌‌‌‌‌‌‌‌–జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిగణనలోకి తీసుకుంటే ఎఫ్‌‌‌‌‌‌‌‌డీఐల ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లోస్‌‌‌‌‌‌‌‌ 47.8 శాతం పెరిగి 16.17 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కంపెనీల్లోకి వచ్చినవి, వచ్చిన లాభాలను తిరిగి ఇన్వెస్ట్ చేసినవి, ఇతర క్యాపిటల్‌‌‌‌‌‌‌‌ను కూడా కలుపుకుంటే మొత్తం ఎఫ్‌‌‌‌‌‌‌‌డీఐలు  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో  42.1 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి.  కిందటేడాది ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన 33.12 బిలియన్ డాలర్ల నుంచి 28 శాతం పెరిగాయి. 

తెలంగాణలోకి  రూ.13 వేల కోట్లు 

ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌–సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మహారాష్ట్ర ఎక్కువ ఎఫ్‌‌‌‌‌‌‌‌డీఐలను ఆకర్షించింది. ఈ రాష్ట్రంలోకి 13.55 బిలియన్ డాలర్లు వచ్చాయి.  ఆ తర్వాత కర్నాటకలోకి 3.54 బిలియన్ డాలర్లు, తెలంగాణలోకి 1.54 బిలియన్ డాలర్లు (సుమారు రూ.13 వేల కోట్లు), గుజరాత్‌‌‌‌‌‌‌‌లోకి 4 బిలియన్ డాలర్లు వచ్చాయి. మారిషస్ (5.34 బిలియన్ డాలర్లు), సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (7.53 బిలియన్ డాలర్లు), యూఎస్ (2.57 బిలియన్ డాలర్లు), నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌ (3.58 బిలియన్ డాలర్లు), యూఏఈ (3.47 బిలియన్ డాలర్లు),  సిప్రస్‌‌‌‌‌‌‌‌ (808 మిలియన్ డాలర్లు) నుంచి ఇండియాలోకి ఎక్కువగా ఎఫ్‌‌డీఐలు వచ్చాయి. జపాన్‌‌‌‌‌‌‌‌, యూకే నుంచి మాత్రం ఎఫ్‌‌‌‌‌‌‌‌డీఐలు తగ్గాయి.