మహారాష్ట్రలో పుణెలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో కార చాలావేగంలో ఉందని తెలస్తోంది. దీంతో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన ఆరుగురు వ్యక్తులు చనిపోయారు. మృతులను రఫీక్ ఖురేషి, ఫెరోజ్ ఖురేషి, సయ్యద్ అమర్, మహబూబ్ ఖురేషీ, ఫిరోజ్, సయ్యద్ ఇస్మాయిల్ గా గుర్తించారు.
వీరంతా నారాయణ ఖేడ్ నుంచి పుణేకు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు అక్కడి పోలీసులకు ప్రమాదం గురించి తెలియజేయగానే అక్కడికి చేరుకున్నారు. పోలీసులు యాక్సిడెంట్ కు గల కారణాలు ఆరా తీస్తున్నారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. మృతదేహాలను స్థానిక హాస్పటల్ కు తరలించారు.