లక్ష్మణచాంద(మామడ), వెలుగు: మామడ మండలంలోని పొన్కల్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎదుట సోమవారం రైతులు ఆందోళన చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడంతో ఈ బ్యాంకులోనే రూ.లక్ష రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ నిధులు తక్కువగా రావడంతో ధర్నాకు దిగారు.
గ్రామానికి వచ్చిన వ్యవసాయ అధికారులకు రైతులకు గోడు విన్నవించుకోగా వారు మేనేజర్‌ను వివరాలు అడిగారు. సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగిందని, భయపడాల్సిన అవసరం లేదని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని బ్యాంక్ మేనేజర్ పేర్కొన్నారు. దీంతో వారు ఆందోళన విరమించారు.