శిథిలావస్థలో సోమిని రైతు వేదిక

రూ.20 లక్షలు పెట్టి కట్టిన రైతు వేదిక అలంకార ప్రాయంగా మారింది. నాణ్యతా లోపం కారణంగా శిథిలావస్థకు చేరింది. బెజ్జురు మండలంలోని ప్రాణహిత సరిహద్దున ఉన్న సోమిని క్లస్టర్ రైతు వేదిక రేకులు ఎక్కడికక్కడ లేచిపోయాయి.

రేకుల మధ్య ఫీట్ వరకు సందు ఏర్పడి వాన నీటికి ఇందులోని రికార్డులు, ఫర్నీచర్ తడిచిపోతోంది. ఫలితంగా రైతు వేదికలో ఎలాంటి మీటింగులు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. వేదిక చుట్టూ ఉన్న ప్లాట్ ఫాం మొత్తం డ్యామేజీ అయ్యింది. ఇకనైనా అధికారులు రైతు వేదికను పట్టించుకొని రిపేర్లు చేయాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.    -  వెలుగు, కాగజ్ నగర్