తొగుట, వెలుగు: పూర్తి నష్టపరిహారం ఇచ్చి పనులు చేసుకోవాలంటూ రైతులు అదనపు టీఎంసీ పనులను అడ్డుకున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని బండారుపల్లి గ్రామంలోని రైతుల వద్ద గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ కాల్వ కోసం భూసేకరణ చేశారు. ఆ సమయంలో ఎకరాకు రూ.15 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి మొదటి విడతగా రూ. 9 లక్షలు ఇచ్చి పనులు ప్రారంభించారు.
మిగతా డబ్బుల కోసం రైతులు మండలంలోని తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఆదివారం కాంట్రాక్టర్కాల్వ పనులను ప్రారంభించడంతో వచ్చి అడ్డుకున్నారు. దీంతో సదరు కంపెనీ యాజమాన్యం రైతులతో మాట్లాడి జూలై 16 లోపు ప్రభుత్వం నుంచి చెక్కులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. లేనిపక్షంలో కంపెనీ యాజమాన్యం డబ్బులు ఇస్తామని చెప్పడంతో రైతులు ధర్నాను విరమించారు. కార్యక్రమంలో కోల దుర్గయ్య, పరమేశ్వర్, బాల్ రాజు, చిన్నోల నారాయణ, బాలమణి, దేవయ్య, సత్తయ్య, పలువురు రైతులు పాల్గొన్నారు.