జైపూర్(భీమారం), వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే డా.వివేక్ వెంకటస్వామి ఫొటోలకు భీమారం మండలం కాజిపల్లి రైతులు, మహిళలు క్షీరాభిషేకం చేశారు. గొర్రెలు, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని నిరూపించుకున్నారని, రైతులు, వ్యవసాయ కోసం భారీగా బడ్జెట్ కేటాయించడం హర్షనీయమన్నారు.
రైతు రుణమాఫీ పట్ల ఇచ్చిన హామీ నెరవేరుస్తున్న సందర్భంగా సీఎం, ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలకు గ్రామ రైతులు, మహిళలతో క్షీరాభిషేకం చేసి సంబరాలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు దేవుని శంకరయ్య, దాడి తిరుపతి, భాస్కర్, సురేందర్, రామయ్య, రాజయ్య, తిరుపతి, మహిళా నేతలు పాల్గొన్నారు.