మళ్లీ పులి పంజా .. చేనులో పత్తి ఏరుతున్న రైతుపై దాడి

  • గొడ్డలితో తిరగబడడంతో ప్రాణాపాయం తప్పినా... పరిస్థితి విషమం
  • సిర్పూర్‌‌‌‌‌‌‌‌ టి మండలం దుబ్బగూడ సమీపంలో ఘటన
  • వరుస దాడులతో కుమ్రంభీం జిల్లా అడవుల్లో భయాందోళన
  • పులి జాడ కోసం డ్రోన్‌‌‌‌‌‌‌‌ కెమెరాలతో గాలింపు 
  • పులి కనిపిస్తే సౌండ్ చేయాలని ప్రజలకు డీఎఫ్‌‌‌‌‌‌‌‌వో నీరజ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ టిబ్రేవాల్‌‌‌‌‌‌‌‌ సూచన

కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో వరుసగా రెండో రోజు పెద్దపులి పంజా విసిరింది. సిర్పూర్ టి మండలం దుబ్బగూడ గ్రామ సమీపంలో పత్తి ఏరుతున్న రౌత్ సురేశ్‌‌‌‌‌‌‌‌ అనే రైతుపై పులి అకస్మాత్తుగా దాడి చేసింది. శనివారం ఉదయం సురేశ్‌‌‌‌‌‌‌‌ భార్య సుజాతతో కలిసి పత్తి ఏరేందుకు వెళ్లాడు. చేనులో పనిచేస్తుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో పెద్దపులి ఒక్కసారిగా సురేశ్‌‌‌‌‌‌‌‌ వెనుక నుంచి దాడి చేసింది. మెడ భాగాన్ని నోటితో కరిచి పట్టుకొని కొద్దిదూరం లాక్కెళ్లింది. సురేశ్‌‌‌‌‌‌‌‌ తన చేతిలో ఉన్న గొడ్డలితో పులిపై ఎదురు దాడికి దిగాడు. 

అక్కడే ఉన్న సురేశ్‌‌‌‌‌‌‌‌ భార్య గట్టిగా అరవడంతో పులి సురేశ్‌‌‌‌‌‌‌‌ను వదిలి పారిపోయింది. చుట్టుపక్కల ఉన్న చేన్లలోని రైతులు, కూలీలు పరిగెత్తుకుంటూ వచ్చి గాయపడ్డ సురేశ్‌‌‌‌‌‌‌‌ను వాహనంలో సిర్పూర్ టి సివిల్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లారు. రైతు పరిస్థితి విషమంగా ఉండడంతో కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌కు రెఫర్‌‌‌‌‌‌‌‌ చేశారు. తిరిగి అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లారు. శుక్రవారం కాగడ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ మండలం విలేజ్‌‌‌‌‌‌‌‌నంబర్‌‌‌‌‌‌‌‌ 6 సమీపంలో జరిగిన పులి దాడిలో లక్ష్మి అనే మహిళ మృతి చెందిన ఘటన నుంచి తేరుకోకముందే మరో దాడి జరగడం జిల్లాలో కలకలం రేపింది. 

పత్తి పంట చేతికి వచ్చే సీజన్‌‌‌‌‌‌‌‌ కావడంతో రైతులు, కూలీలు  చేన్లకు వెళ్లడం తప్పనిసరి కాగా, వరుస ఘటనలతో అటు వైపు అడుగుపెట్టేందుకే జంకుతున్నారు. చేనుకు పోతే పులి భయం.. పోకుంటే పంట నష్టం. దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా పులి దాడిలో మృతి చెందిన లక్ష్మి కుటుంబానికి పది లక్షల పరిహారం చెక్కులను డీఎఫ్‌‌‌‌‌‌‌‌వో నీరజ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ టిబ్రేవాల్‌‌‌‌‌‌‌‌ అందజేశారు.

Also Read : రైతుబంధును బంజేసే కుట్ర

పులి జాడ కోసం డ్రోన్లతో గాలింపు

పత్తి చేనులో పనిచేస్తున్న లక్ష్మిపై శుక్రవారం పులి దాడి చేసి హతమార్చిన ఘటనతో ఫారెస్ట్ ఆఫీసర్లు అలర్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. పులి కదలికలపై నిఘా పెట్టి, ఎక్కడికక్కడ డ్రోన్‌‌‌‌‌‌‌‌ కెమెరాలతో గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌ రేంజ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ శశిధర్‌‌‌‌‌‌‌‌బాబు ఆధ్వర్యంలో డ్రోన్‌‌‌‌‌‌‌‌ కెమెరాలతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. నజ్రల్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, సీతానగర్, అనుకోడ, గన్నారం, కడంబ, ఆరెగూడ, బాబునగర్‌‌‌‌‌‌‌‌ ప్రాంతాలతో పాటు వివిధ రేంజ్‌‌‌‌‌‌‌‌లలో పులి సంచారంపై అలర్ట్‌‌‌‌‌‌‌‌గా ఉండాలని ప్రజలకు, రైతులకు, కూలీలకు సుచించారు. 

అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రజలు, రైతులు పొలం పనులకు ఒంటరిగా వెళ్లవద్దని హెచ్చరించారు. కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ మండలంలోని 13 గ్రామాల్లో 144 సెక్షన్‌‌‌‌‌‌‌‌ విధించారు. డిసెంబర్ 3 వరకు సెక్షన్‌‌‌‌‌‌‌‌ అమల్లో ఉంటుందని తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌  ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

పులి కనిపిస్తే సౌండ్ చేయండి  : డీఎఫ్‌‌‌‌‌‌‌‌వో నీరజ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌

సిర్పూర్ టి మండలం దుబ్బగూడలో పులి దాడి చేసి సురేశ్‌‌‌‌‌‌‌‌ను గాయపరిచిన విషయం తెలిసిన వెంటనే జిల్లా ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ నీరజ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ టిబ్రేవాల్ కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారు. డాక్టర్లతో మాట్లాడి రైతు ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఫారెస్ట్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తరఫున మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహారాష్ట్ర బార్డర్‌‌‌‌‌‌‌‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో పులి తిరుగుతోందని ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు, రైతులు గుంపులుగా వెళ్లాలని, అనుమానం వచ్చినా, పులి కనిపించినా భయపడకుండా అరుపులు, కేకలు వేయాలని, బ్యాండ్, డప్పుచప్పుళ్లు చేయాలని సూచించారు. ఒకటి, రెండు రోజులు గడిస్తే పులి బయటకు వెళ్లిపోతుందన్నారు.