మెదక్ జిల్లాలో ఎలుగుబంటి దాడిలో రైతుకు గాయాలు

మెదక్​, వెలుగు : హవేలీ ఘన్​పూర్ మండలం దూపిసింగ్ తండాకు చెందిన రైతు రవిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. సోమవారం ఉదయం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన రవిపై ఎలుగుబంటి దాడి చేయడంతో రవి ఎడమ దవడ, చెవి, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. 

పక్క పొలల్లో ఉన్న రైతులు రావడంతో ఎలుగు బంటి అడవిలోకి వెళ్లింది. గాయాలైన రవిని మెదక్ లోని ఓ ప్రవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫారెస్ట్​డిపార్ట్​మెంట్​ఆఫీసర్లు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. గాయపడ్డ రవికి వైద్య ఖర్చుల కోసం రూ.10 వేలు అందించారు.