అప్పులు చేసి మరీ స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టాడు.. పాపం నష్టాలు రావడంతో..

మంచిర్యాల జిల్లా, వెలుగు: స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా ఓ యువకుడు చేసిన పనికి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేట గ్రామనికి చెందిన శివప్రసాద్ అనే యువకుడు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. హైద్రాబాద్ లో చదువుకున్న శివప్రసాద్.. ఉద్యోగం లభించక పోవడంతో ఇంటి వద్దే ఉంటూ కిరాణం నడుపుతున్నాడు. ఈజీ  మనీ కోసం అప్పులు చేసి మరీ స్టాక్ మార్కెట్ లో ఇన్వె్స్ట్ చేశాడు. 

పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోవడంతో కుటుంబం అప్పుల్లో కూరుకుపోయింది. అప్పులు కట్టలేని స్థితిలో ఆందోళనలో కుటుంబం మొత్తం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు మొండయ్య (60) , శ్రీదేవి (50), కూతురు చిట్టి (30), కొడుకు వివప్రసాద్ (26).. ఇలా కుటుంబం మొత్తం ఆత్మహత్యా యత్నం చేసింది. వీరందరినీ చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. శివప్రసాద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.