కాంగ్రెస్​ జనజాతర సభ ఏర్పాట్ల పరిశీలన

నర్సాపూర్, వెలుగు : మెదక్​ జిల్లా నర్సాపూర్ పట్టణ పరిధిలోని వెల్దుర్తి వెళ్లే రోడ్ మార్గంలో గురువారం జరిగే కాంగ్రెస్​జనజాతర సభ ఏర్పాట్లను మంత్రి కొండా సురేఖ, కేరళ ఎంపీ సురేశ్, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి , టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు  పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ జనజాతర సభకు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ హాజరవుతున్నారని తెలిపారు.

స్టేజిపై 200 మంది కూర్చునే విధంగా అలాగే సభ స్థలంలో 50,000 మంది కూర్చునే సామర్థ్యం ఉండేలా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు,  కార్యకర్తలు, ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మల్లేశం, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, నాయకులు సుదర్శన్ గౌడ్, సూర్య చౌహాన్, ఉదయ్, రషీద్, అజ్మత్ పాల్గొన్నారు.