కడెంలో సిల్ట్ ప్రాసెసింగ్ యూనిట్

  •  సర్కారు స్థలాల కోసం అన్వేషణ
  •  రెండు గ్రామాల్లో 100 ఎకరాల గుర్తింపు

 నిర్మల్, వెలుగు : కడెం ప్రాజెక్టు నుంచి తొలగించనున్న సిల్ట్​కు సంబంధించి మట్టి, ఇసుకను వేరు చేసేందుకు ఇదే ప్రాంతంలో ప్రత్యేక ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు స్థల సేకరణకు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికా రులు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో ఇక్కడి ప్రాజెక్టు ఈఈతో పాటు ఇతర అధికారులు రెవెన్యూ ఆఫీసర్ల సహకారంతో రెండు గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించారు.

ప్రాసెసింగ్ యూనిట్ కోసం 20 ఎకరాల స్థలం అవసరం కాగా అదనంగా స్టాక్ పాయింట్ కోసం మరో 80 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. రేవేజిపేటలో 30 ఎకరాలు, ఎర్వచింతలలో మరో 75  ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి దీనికి సంబంధించిన రికార్డులను ప్రభుత్వానికి పంపారు. స్థల సేకరణ అనంతరం పూడికతీత పనులతోపాటు ప్రాసె సింగ్ యూనిట్   నిర్వహణలో అనుభవమున్న ఏజెన్సీకి బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు అధికారులు తెలిపారు.