పీఎఫ్ కట్ అవుతున్న ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. 2025 మే లేదా జూన్ తర్వాత..

ఢిల్లీ: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుభవార్త చెప్పారు. ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ సేవలను మరింత చేరువ చేసేందుకు 2025 మే లేదా జూన్ నాటికి ఈపీఎఫ్ఓ మొబైల్ అప్లికేషన్తో పాటు, ఈపీఎఫ్ఓ ఖాతాలోని డబ్బును ఏటీఎంల్లో కూడా విత్ డ్రా చేసుకునేలా డెబిట్ కార్డ్ సదుపాయం తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఈపీఎఫ్ఓ 2.0లో భాగంగా.. ఈ వ్యవస్థలోని మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని (ఐటీ సిస్టం) అప్గ్రేడ్ చేసే దిశగా కేంద్రం ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది. జనవరి నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం ఉంది. 

ఇది పూర్తి కాగానే.. 2025 మే లేదా జూన్ లో ఈపీఎఫ్ఓ 3.0 యాప్ను కేంద్రం ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకురావాలని డిసైడ్ అయింది. ఈపీఎఫ్ఓ సబ్స్రైబర్లకు బ్యాంకింగ్ ఫెసిలిటీని అందించడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశం. ఈపీఎఫ్ఓ డబ్బుకు సంబంధించిన క్లైమ్ సెటిల్మెంట్ ప్రక్రియ ఈ యాప్ వల్ల సులభతరం కానుంది.

ఈ సేవలను అందించే విషయంలో సమన్వయం కోసం కేంద్ర ఆర్థిక శాఖకు, ఆర్బీఐకి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలు ఒక కొలిక్కి రాగానే.. ఈపీఎఫ్ఓ ఖాతాదారులు నేరుగా ఏటీఎం సెంటర్లకు వెళ్లి ఖాతాలోని డబ్బును డెబిట్ కార్డ్ ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తుంది. అయితే విత్ డ్రా లిమిట్ ఎంతనే ప్రశ్న ఖాతాదారుల్లో తలెత్తే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే.. ఈపీఎఫ్ఓ ఖాతాలో ఉన్న మొత్తం సొమ్మును విత్ డ్రా చేసుకునే అవకాశం ఖాతాదారుడికి ఉండదు. 

ALSO READ | డీమార్ట్​ ఆదాయం రూ.15,565 కోట్లు

విత్ డ్రాపై కేంద్రం పరిమితి విధించే అవకాశం ఉంది. అయితే.. ఇక్కడ కొంత ఊరట కలిగించే విషయం ఏంటంటే.. విత్ డ్రా పరిమితికి సంబంధించి ఈపీఎఫ్ఓ అనుమతి తప్పనిసరి కాదు. ఫామ్ ఫిల్లింగ్, ఈపీఎఫ్ఓ ఆఫీస్ కు ఒకటికి రెండు సార్లు తిరగడం.. కేంద్రం తీసుకురాబోతున్న ఈ కొత్త విధానం వల్ల ఖాతాదారులకు ఈ తిప్పలు తప్పనున్నాయి.

ఏటీఎం కార్డులు ఖాతాదారులకు ఎలా చేరతాయి..?
పీఎఫ్ అమౌంట్ను ఈ నెల నుంచే ఏటీఎంల ద్వారా విత్‌‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఈ కొత్త ఫెసిలిటీని తీసుకురావాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌‌ఓ) చూస్తోంది. సబ్‌‌స్క్రయిబర్లకు ఏటీఎం కార్డులను మొదట ఇష్యూ చేస్తారు.  వీటితో పీఎఫ్‌‌ను విత్‌‌డ్రా చేసుకోవచ్చు. మరోవైపు  హయ్యర్ పెన్షన్‌‌ కోసం అప్లయ్‌‌ చేసుకోవాలంటే జనవరి 31 చివరి తేది. గతంలో పేర్కొన్న జనవరి 15 నుంచి పొడిగించారు. ఈపీఎఫ్‌‌ఓ ఈ–వాలెట్లను కూడా తీసుకొస్తోంది. పీఎఫ్‌‌ అమౌంట్‌‌ను ఈ–వాలెట్ల ద్వారా వాడుకోవచ్చు.

అంతేకాకుండా పీఎఫ్‌‌ కోసం ఉద్యోగులు చేసే కంట్రిబ్యూషన్ లిమిట్‌‌ను తొలగించాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగి బేసిక్ శాలరీలో 12 శాతం పీఎఫ్‌‌కు యాడ్ అవుతోంది. ఈ లిమిట్‌‌ తీసేసే ఆలోచనలో ఉన్నారు. వీటితో పాటు  జనవరి 1 నుంచి ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్‌‌ను తీసుకునే వెసులుబాటును ఈపీఎఫ్‌‌ఓ కల్పిస్తోంది. ఈపీఎస్ పెన్షనర్ల కోసం ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్‌‌ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది.