పోతారం లో 15 ఏండ్లకింద మూతపడ్డ స్కూల్​ రీఓపెన్​

బెజ్జంకి, వెలుగు : మండలంలోని పోతారం లో 15 సంవత్సరాల క్రితం మూసేసిన స్కూల్​ను బుధవారం డీఈఓ శ్రీనివాస్ రెడ్డి తిరిగి ప్రారంభించారు. విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు, బట్టలు, మధ్యాహ్న భోజనం ప్రభుత్వం అందిస్తుందన్నారు.

పాఠశాలకు మరమతులు చేసి, పెయింటింగ్ వేయించిన జీపీ కార్యదర్శిని సన్మానించారు. ఎంపీడీఓ లక్ష్మప్ప, ఎలక్ట్రోల్ ఆఫీసర్ భాస్కర్, ఎంపీఓ విష్ణు, ప్రత్యేక అధికారి రేణుక పాల్గొన్నారు.