మెదక్ ఫుట్ బాల్ అకాడమీ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ఫుట్ బాల్​ పోటీలు

మెదక్, వెలుగు: ఇంటర్నేషనల్​ఫుట్ బాల్ ప్లేయర్​పీకే బెనర్జీ పుట్టిన రోజును పురస్కరించుకొని తెలంగాణ ఫుట్ బాల్అసోసియేషన్ ఆదేశాల మేరకు మెదక్ ఫుట్ బాల్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం మెదక్ స్పోర్ట్స్​స్టేడియంలో ఫుట్ బాల్ గ్రాస్ రూట్ డెవలప్​మెంట్​డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 11 నుంచి13 ఏళ్లలోపు బాలికలకు, 14 నుంచి 16 ఏళ్ల లోపు బాలికలకు, 40 ఏళ్ల పైబడిన పురుషులకు పోటీలు నిర్వహించారు. వివిధ స్కూళ్ల నుంచి మొత్తం 150 మంది బాలికలు, 40 మంది పురుషులు పోటీల్లో పాల్గొన్నారు. 

కార్యక్రమానికి జిల్లా యువజన, క్రీడల అధికారి నాగరాజు హాజరై మాట్లాడుతూ ప్రతిరోజు స్టేడియంలో ఉచితంగా ఫుట్​బాల్​క్రీడలో శిక్షణ ఇస్తున్నామని ఈ అవకాశాన్ని మెదక్ పట్టణ, జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పీకే బెనర్జీ భారత దేశం తరఫున ఫుట్​బాల్​క్రీడలో ఒలంపిక్స్ ఆడిన మొట్ట మొదటి వ్యక్తి అని గుర్తు చేశారు. అనంతరం పోటీల్లో గెలిచిన జట్లకు బహుమతులను అందజేశారు. 

కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గోపాల్ గౌడ్, రామచందర్, బాలకృష్ణ, కోచ్​లు ప్రకాశ్,  భాగ్యమ్మ, మెదక్ ఫుట్ బాల అకాడమీ అధ్యక్ష, కార్యదర్శులు వంశీ, వినయ్, సభ్యులు ప్రశాంత్, మున్నా, రిజ్వాన్ పాల్గొన్నారు.