టైంకి ఆఫీసుకు రాని ఉద్యోగులు : వెక్కిరిస్తున్న ఖాళీ కుర్చీలు

కుభీర్, వెలుగు: కుభీర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులు లేక ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తున్నాయి. దీంతో కార్యాలయంలో వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఎంపీడీవో, టైపిస్ట్, ఎంపీఓ బదిలీపై వెళ్లారు. కానీ ఎంపీఓ ఒక్కరు మాత్రమే విధుల్లో చేరారు. 

ఎంపీడీవో, టైపిస్ట్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీరితోపాటు అనారోగ్య కారణాలతో  జూనియర్ అసిస్టెంట్  విధులకు హాజరు కావడం లేదు. ఎంపీఓకు ఎంపీడీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఒక్కరికే రెండు బాధ్యతలు అప్పగించడంతో ఏ పోస్టుకు సరైన న్యాయం చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి రెగ్యులర్ ఎంపీడీవోతో పాటు కిందిస్థాయి అధికారులను నియమించాలని స్థానికులు కోరుతున్నారు.