లెనెవో నుంచి కొత్త ట్యాబ్​..ఫీచర్స్ అదిరిపోయాయ్

ఎలక్ట్రానిక్స్​కంపెనీ లెనెవో కే11 టాబ్లెట్ అప్ గ్రేడెడ్ వెర్షన్ ట్యాబ్ కే11 (ఎన్ హాన్స్ డ్ ఎడిషన్)ను భారత్ లో విడుదల చేసింది. ఇందులో 11 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లే, డాల్బీ అట్మాస్ క్వాడ్ స్పీకర్లు, మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ (1 టీబీ వరకు పెంచుకోవచ్చు) వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 

బరువు కేవలం 496 గ్రాములు కాగా, 7.15 మిల్లీమీటర్ల మందమే ఉంటుంది. వైఫై, బ్లూటూత్ 5.1, ఎల్టీఈ, ఫాస్ట్ ఛార్జింగ్, 7040 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. లెనెవో ట్యాబ్ కే11  లూనా గ్రే కలర్లో లభ్యమవుతుంది. ధర రూ.22,999 అని కంపెనీ తెలిపింది. అమ్మకాలు మొదలయ్యాయి.