కోల్బెల్ట్,వెలుగు : మందమర్రి పట్టణంతో పాటు పలు గ్రామాలకు శనివారం విద్యుత్ సప్లై ఉండదని ట్రాన్స్కో ఏడీఈ రాజశేఖర్, మందమర్రి, క్యాతనపల్లి ఏఈలు మల్లేశం, జయకృష్ణ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు మందమర్రి పట్టణంలోని సింగరేణి జీఎం ఆఫీస్, యాపల్, కే కే 2, ఊరు మందమర్రి , ఎర్ర గుంట పల్లి, మార్కెట్, దీపక్ నగర్, శ్రీపతి నగర్
దొరల బంగ్లా, పాలచెట్టు, పులి మడుగు, అందుగుల పేట, కోటేశ్వరరావు పల్లి,నార్ల పూర్, బొక్కల గుట్ట గ్రామాలకు, పాలచెట్టు సబ్స్టేషన్ పరిధిలోని సారంగపల్లి, శంకర్పల్లి, చిర్రకుంట, పోన్నారం, వెంకటాపూర్ గ్రామాలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు.