హోండా నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు

జపనీస్ కంపెనీ హోండా మోటార్‌‌‌‌‌‌‌‌సైకిల్‌‌‌‌  రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను బుధవారం లాంచ్ చేసింది. యాక్టివ ఈ, క్యూసీ1 పేరుతో వీటిని తీసుకొచ్చింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి వీటి బుకింగ్స్ మొదలవుతాయి. ఫిబ్రవరి నుంచి డెలివరీని మొదలుపెడతారు. యాక్టివ ఈ  బండిలోని బ్యాటరీని స్వాప్ చేసుకోవచ్చు. క్యూసీ1లో ఫిక్స్డ్ బ్యాటరీ ఉంటుంది. వీటి ధరలను ప్రకటించలేదు.